సాంకేతిక శిక్షణ దూరం
ABN , Publish Date - May 14 , 2026 | 11:48 PM
పట్టణంలోని కర్నూలు రహదారి గోరుమానుకొండ సమీపంలో నాలుగేల్ల క్రితం ఎంఎస్‌ఎంఈ టూల్స్ భవనాన్ని నిర్మించారు. సాంకేతిక విద్య అభ్యసించిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, వారికి ఉద్యోగాలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
ప్రారంభానికి నోచుకోని ఎంస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్
మంగళగిరికి తరలించినట్లు సమాచారం
నిరాశ చెందుతున్న ఐటీఐ, సాంకేతిక విద్యార్థులు
బేతంచెర్ల, మే 14 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కర్నూలు రహదారి గోరుమానుకొండ సమీపంలో నాలుగేల్ల క్రితం ఎంఎస్‌ఎంఈ టూల్స్ భవనాన్ని నిర్మించారు. సాంకేతిక విద్య అభ్యసించిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, వారికి ఉద్యోగాలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. నాటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ద్వారా, వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు శిక్షణ కేంద్రాలను మంజూరు చేశారు. విశాఖపట్నంలో ఒకటి ఉండగా, రెండో శిక్షణ కేంద్రాన్ని బేతంచెర్లలో ఏర్పాటు చేశారు. అయితే ఎంఎస్‌ఎంఈ టూల్స్ శిక్షణ కేంద్రాన్ని టీడీపీ ప్రభుత్వం మంగళగిరికి మార్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలోని సాంకేతిక అభ్యర్థులకు శిక్షణ అందడం లేదు. కలెక్టర్ స్పందించి, శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాలని సాంకేతిక అభ్యర్థులు కోరుతున్నారు.