వ్యథాసుపత్రి
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:47 PM
: పెద్దాసుపత్రికి వచ్చే రోగులకు కనీస సౌకర్యాలు అందడం లేదు. అత్యవసర వెద్యం చేసే క్యాజువాల్టీకి రావాలంటే నరకప్రాయంగా మారింది.
పెద్దాసుపత్రిలో వీల్‌చైర్లు, స్ట్రెచర్లు లేక రోగుల అవస్థలు
కర్నూలు హాస్పిటల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): పెద్దాసుపత్రికి వచ్చే రోగులకు కనీస సౌకర్యాలు అందడం లేదు. అత్యవసర వెద్యం చేసే క్యాజువాల్టీకి రావాలంటే నరకప్రాయంగా మారింది. ఓర్వకల్లు మండలం లొద్దిపల్లెకు చెందిన రామాంజనేయులు తలకు గాయం కావడంతో ఆదివారం సాయంత్రం క్యాజువాల్టీకి వచ్చారు. వైద్యులు అల్ర్టాసౌండ్ పరీక్ష చేయించుకోవాలని రాసి ఇవ్వగా, స్టెచ్చర్ లేకపోవడంతో విరిగిన స్టెచ్చర్‌ను ఆరుమంది బందువులు మోసుకుంటూ న్యూడయోగ్నస్టిక్ బ్లాక్‌కు తీసుకునివచ్చారు. అత్యవసర స్థితిలో ఉండే రోగుల పట్ల ఇలా వ్యవహరించడం, స్టెచ్చర్లు, వీల్ చైర్లు అందుబాటులో లేకపోతే ఎలా అని రోగుల సహాయకులు మండిపడుతున్నారు.