Share News

అల్పాహారం అందక..

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:53 PM

ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్‌ పంపిణీ చేయకపోవడంతో వారు నిరసించిపోతున్నారు. గతంలో పరీక్షలకు ముందు రోజూ స్నాక్స్‌ను పంపిణీ చేసేవారు.

అల్పాహారం అందక..

నీరసించిపోతున్న పదో తరగతి విద్యార్థులు

ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు

కర్నూలు ఎడ్యుకేషన్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్‌ పంపిణీ చేయకపోవడంతో వారు నిరసించిపోతున్నారు. గతంలో పరీక్షలకు ముందు రోజూ స్నాక్స్‌ను పంపిణీ చేసేవారు. ఈసారి మాత్రం విద్యాశాఖ అధికారులు, కలెక్టర్‌ చర్యలు తీసుకోలేదు. జిల్లాలో 361 అన్ని ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలుండగా, 21,950 మంది విద్యార్థులు చదువతున్నారు. ఈ ఏడాది వందశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో వందరోజుల ప్రణాళికతో డిసెంబరు నుంచి ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఉదయం 8 గంటలకే బడికి రావాలి. గ్రామాల విద్యార్థులు బడికి రావాలంటే ఉదయం7 గంటలకే ఇంటి నుంచి బయలుదేరాలి, అలాగే సాయంత్రం ప్రత్యేక తరగతులు ముగిసి, ఇంటికి చేరేసరికి 7 గంటలవుతోంది. స్నాక్స్‌ లేకపోవడంతో విద్యార్థులు నీరసిస్తున్నారు. గత కలెక్టర్‌ చొరవ తీసుకుని రోజూ సాయంత్రం స్నాక్స్‌ పంపిణీ చేసేలా చూశారు. కలెక్టర్‌, విద్యాశాఖ అదికారులు స్పందించి పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్‌ను పంపిణీ చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jan 21 , 2026 | 11:53 PM