తవ్వారు.. వదిలేశారు!
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:35 AM
మండలంలోని తిప్పారెడ్డిపల్లె గ్రామం వద్ద కల్వర్టు నిర్మించేందుకు ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో గుంతలు తవ్వారు. అయితే వాహనాల రాకపోకల కోసం సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
తిప్పారెడ్డిపల్లె వద్ద సర్వీసు రోడ్డు నిర్మించకపోవడంతో వాహనదారుల నరకయాతన
రుద్రవరం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తిప్పారెడ్డిపల్లె గ్రామం వద్ద కల్వర్టు నిర్మించేందుకు ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో గుంతలు తవ్వారు. అయితే వాహనాల రాకపోకల కోసం సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఓ లారీ ఇరుక్కుని గుంతలో ఇరుక్కుపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఇక వర్షాలు పడితే వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సర్వీస్ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.
కాగా ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఏఈ, వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సర్వీసురోడ్డు నిర్మించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.