ఇదేనా స్వచ్ఛపథం!
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:25 AM
అధికారులు ఓ వైపు స్వచ్ఛపథం కార్యక్రమం పేరుతో ఊదరగొడుతూ ఫొటోలకు ఫోజులిచ్చి వెళుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు
ఫొటోలకు ఫోజులిచ్చి వెళుతున్న అధికారులు
చాగలమర్రిలో రోడ్డుపైనే మురుగు
చాగలమర్రి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): అధికారులు ఓ వైపు స్వచ్ఛపథం కార్యక్రమం పేరుతో ఊదరగొడుతూ ఫొటోలకు ఫోజులిచ్చి వెళుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలోని కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయినా పట్టించుకోకపోవడంతో దుర్వాసన వస్తోంది. భూమానగర్, మోమినివీధి, పాత బస్టాండు సమీపంలో రహదారిపై మురుగు నిలిచింది. వాహనదారులు, పాదచారులు ముక్కున వేలేసుకొని వెళ్లాల్సి వస్తోంది. అలాగే పెద్దబోదనం, మద్దూరు, గొడిగనూరు, ముత్యాలపాడు తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. వర్షాలు ప్రారంభమయ్యాయని, అధికారులు ఇప్పటికైనా స్పందించి, పారిశుధ్య పనులు చేయించాలని ప్రనజలు కోరుతున్నారు.