పడకేసిన పారిశుధ్యం
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:05 AM
గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. అధికారులు కేవలం నెలలో ఒకరోజు స్వచ్చంధ్ర-స్వచ్ఛదివాస్ పేరిట హంగామా చేసి, అనంతరం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
చాగలమర్రిలో మురుగుతో ప్రజల అవస్థలు
చాగలమర్రి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. అధికారులు కేవలం నెలలో ఒకరోజు స్వచ్చంధ్ర-స్వచ్ఛదివాస్ పేరిట హంగామా చేసి, అనంతరం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో 19 పంచాయతీలు, 11 మజరా గ్రామాలు ఉన్నాయి. 52 వేల మంది జనాభా ఉన్నారు. మేజర్ పంచాయతీ చాగలమర్రిలో కాలువలు మురుగుతో నిండి దుర్వాసనతో ప్రజలు అల్లాడుతున్నారు. శ్రీనివాసనగర్, బాలికల పాఠశాల సమీపం వద్ద మురుగుకుంటగా మారింది. దీంతో ప్రజలు ముక్కున వేలేసుకొని వెళ్లాల్సి వస్తోంది. కాలువలు నిర్మించాలని పలు మార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.