కార్మికుల ఆకలి కేకలు
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:17 AM
తమకు ఆరు నెలలుగా జీతాలు అందడం లేదని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 47 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 49 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
పాఠశాలల్లో పనిచేసేవారికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వని అధికారులు
చాగలమర్రి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): తమకు ఆరు నెలలుగా జీతాలు అందడం లేదని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 47 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 49 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే జీతాలు అందక పోవడంతో కుటుంబ పోషణ భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ 6 నెలల జీతాలను మంజూరుచేసి ఆదుకోవాలని కలెక్టర్, డీఈవోను కోరారు. ఈ విషయమై ఎంఈవో న్యామతుల్లను వివరణ కోరగా కార్మికులకు 6 నెలల జీతాలు రాకపోవడం వాస్తవమేనని, బిల్లులను ఇప్పటికే ఉన్నతాధికారులలకు పంపామని, ప్రభుత్వం బడ్జెట్ ఇస్తే వేతనాలు మంజూరవుతాయని తెలిపారు.