ఆరు నెలలుగా జీతాల్లేవ్...!
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:16 AM
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించడం లేదనే సామెత మాదిరి రాష్ట్రంలోని వ్యవసాయ శాఖలో పని చేస్తున్న ఎంపీఈవోల పరిస్థితి దయనీయంగా ఉందని, ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని ఎంపీఈవోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నాళ్లిలా పస్తులుండాలి?
జీవోను పట్టించుకోరా అని ఎంపీఈవోల ఆవేదన
వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు వినతి పత్రం
కర్నూలు అగ్రికల్చర్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించడం లేదనే సామెత మాదిరి రాష్ట్రంలోని వ్యవసాయ శాఖలో పని చేస్తున్న ఎంపీఈవోల పరిస్థితి దయనీయంగా ఉందని, ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని ఎంపీఈవోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అధికారులు ఇవ్వడం లేదని తెలిపారు. ఇటీవల తాము వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ను కలిశామని, తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కేవలం రూ.12వేల జీతం గత 12 సంవత్సరాల నుంచి తీసుకుంటూ రైతులకు రేయింబవళ్లు సేవలందిస్తున్నామని, అయితే ప్రభుత్వానికి మాత్రం కనికరం లేకుండా పోయిందన్నారు. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, రాష్ట్ర కోశాధికారి మధుగౌడు, ఇతర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.