విద్యార్థులకు అందని శుద్ధజలం
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:39 AM
మండల క్రేందలోని బాలుర ఉన్నత పాఠశాలలో రెండేళ్ల నుంచి ఆర్‌వో ప్లాంటు పనిచేయడం లేదు దీంతో విద్యార్థులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు 1,007 మంది విద్యార్థులు చదువుతున్నారు.
చాగలమర్రిలో మూతపడ్డ మినరల్ వాటర్ ప్లాంట్
ప్యాపిలి మండలం గుడిపాడు ఎంపీపీ పాఠశాలలోనూ అంతే..
చాగలమర్రి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మండల క్రేందలోని బాలుర ఉన్నత పాఠశాలలో రెండేళ్ల నుంచి ఆర్‌వో ప్లాంటు పనిచేయడం లేదు దీంతో విద్యార్థులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు 1,007 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం రూ.12 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది అయితే విద్యుత్‌మోటార్ కాలిపోవడంతో నీరు సరఫరా కావడం లేదు. రెండు మినీ ట్యాంకులను ఏర్పాటుచేసినా ఆ నీరు పరిపోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్‌కు మరమ్మతులు చేయించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై హెచ్‌ఎం జీవయ్యను ప్లాంట్ పనిచేయడం లేదని అధికారులకు తెలియజేశామని, ఇందుకు రూ.8 లక్షలు అవుతుందన్నారు. ఎస్టీఎంఎ్‌సయా్‌పలో కూడా నమోదు చేశామని తెలిపారు.
పనిచేయని ఆర్‌వో ప్లాంట్
ప్యాపిలి:మండలంలోని గుడిపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో ఆర్‌వో ప్లాంట్ పనిచేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు క్రింద రూ.5లక్షలు వెచ్చించి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. నిర్వహణ లేకపోవడంతో ఏడాది పాటు పనిచేసిన ప్లాంట్ అనంతరం పనిచేయడం లేదు. తాగునీరు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇంటినుంచి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తుందని ప్లాంట్‌కు మరమ్మతులు చేయించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.