Share News

వైసీపీకి విమర్శించే హక్కు లేదు

ABN , Publish Date - May 04 , 2026 | 11:35 PM

టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును వైసీపీ కోల్పోయిందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి అన్నారు. సోమవారం మెట్టుపల్లె గ్రామంలో మీభూమి-మీహక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదార్‌ పాసుపుస్తుకాలను పంపిణీ చేశారు.

వైసీపీకి విమర్శించే హక్కు లేదు
మెట్టుపల్లె గ్రామంలో పట్టాదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేస్తున్న మంత్రి

మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ, సీసీ రోడ్లు ప్రారంభం

అవుకు, మే 4 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును వైసీపీ కోల్పోయిందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి అన్నారు. సోమవారం మెట్టుపల్లె గ్రామంలో మీభూమి-మీహక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదార్‌ పాసుపుస్తుకాలను పంపిణీ చేశారు. మంత్రికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, చల్లా విజయబాస్కర్‌రెడ్డి, వంగల పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆర్డీవో నరేంద్రనాథ్‌రెడ్డి, తహసీల్దార్‌ నాగేశ్వరరెడ్డితో కలసి 728 రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా రాజముద్రతో ముద్రించిన పాస్‌ పుస్తకాలను ఇస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రీ సర్వే పేరుతో రైతుల భూముల్లో అక్రమాలకు పాల్పడి రైతులకు కంటి మీద కునుకు లేకుండ చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్‌టైటిల్‌ యాక్ట్‌ను రద్దుచేసి రైతుల హక్కులను పరిరక్షించామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పట్టాదారు పుస్తకాలపై జగన్‌మోహన్‌రెడ్డి ఫోటో వేసుకోవటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. రెవెన్యూ సమస్యలపై ప్రతినెల 9న సీఎం చంద్రబాబు గ్రామాలకు వెళ్లి రైతులతో ముఖాముఖి చర్చిస్తున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. 2014లో మెట్టుపల్లెలో రూ.61లక్షలతో పనులు చేశామన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ. 55 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. వైసీపీ 5ఏళ్ల పాలనలో గ్రామ అభివృద్దికి రూ.12 లక్షలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. పీఆర్‌ డీఈ నాగశ్రీనివాసులు, ఎంపీడీవో రామక్రిష్ణవేణి, ఏవో కలిమున్నీసా, బనగానపల్లె మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి, పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు మారం పుల్లారెడ్డి, జగదీశ్వరరెడ్డి, భాస్కర్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, మహేంద్రనాథ్‌రెడ్డి, లక్ష్మినారాయణ, పెద్దిరాజు, మల్లి పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2026 | 11:35 PM