Share News

టీడీపీని విమర్శించే అర్హత గొడ్డలి పార్టీకి లేదు

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:30 AM

తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత వైసీపీ అలియాస్‌ గొడ్డలి పార్టీకి లేదని రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ముదిగేడు గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకు వెలఙ్ల పింఛన్లు పంపిణీ చేశారు.

టీడీపీని విమర్శించే అర్హత గొడ్డలి పార్టీకి లేదు
అవ్వా బాగున్నావా.. ముదిగేడులో పింఛన్‌ ఇస్తున్న మంత్రి

ఎన్నికల్లో లబ్ధికే వైఎస్‌ విగ్రహం ధ్వంసం : మంత్రి బీసీ

సంజామల, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత వైసీపీ అలియాస్‌ గొడ్డలి పార్టీకి లేదని రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ముదిగేడు గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకు వెలఙ్ల పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్ధల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గొడ్డలి పార్టీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు టీడీపీ నాయకులు వైసీపీ కుచ్చులో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. 1995లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచి ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపారన్నారు. 150 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా వైసీపీ వారికి బుద్ధి రాలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే పింఛన్లను రూ.4వేలకు పెంచామని, మెగా డీఎస్సీలో 16వేలు, పోలీస్‌ 6వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పెట్టుబడిదారులను బెదిరిస్తున్నారని తాను తప్పుచేసి 16 నెలలు జైలుకు వెళ్లితే అందరిని అలానే జైలుకు పంపిస్తాననడం సరికాదన్నారు. మద్దిలేటి రెడ్డి, పెండేకంటి కిరణ్‌ కుమార్‌, తులసి రెడ్డి, మూసాని చంద్రశేఖర్‌ రెడ్డి, మోహన్‌ రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ లక్ష్మీదేవి, సూర్యవర్ధన్‌ రెడ్డి, పసుపల మహమ్మద్‌, జనసేన నాయకులు బారే ఇమామ్‌, నరేష్‌, మద్దిలేటి, మాధవ, మల్కి హుస్సేన్‌, నందిరెడ్డి విష్ణుశేఖర్‌ రెడ్డి, దాట్ల చంద్రశేఖర్‌ రెడ్డి, డీలర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, నాగరాజు, మోహన్‌ రెడ్డి, పరమేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌

పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరమని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 32 మంది లబ్ధిదారులకు రూ.14.40 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నో ప్రాణాలు నిలబెట్టారన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 12:30 AM