Share News

విశ్రాంతి లేదు బ్రో..

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:18 AM

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బెలుం గుహల్లో పర్యాటలకులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఏటా గుహల నుంచి ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా, వీటిని చేసేందుకు ఇటు అధికారులు శ్రద్ధ చూపడం లేదని పర్యాటకు ఆరోపిస్తున్నారు.

విశ్రాంతి లేదు బ్రో..
శిథిలావస్థకు చేరుకున్న డార్మిటరీ

బెలుం గుహల వద్ద విశ్రాంతి భవనం శిథిలావస్థ

నిరాశ చెందుతున్న పర్యాటకులు

కొలిమిగుండ్ల, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బెలుం గుహల్లో పర్యాటలకులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఏటా గుహల నుంచి ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా, వీటిని చేసేందుకు ఇటు అధికారులు శ్రద్ధ చూపడం లేదని పర్యాటకు ఆరోపిస్తున్నారు.

శిథిలావస్థలో డార్మిటరీ..

ఇక్కడికి వచ్చే పర్యాటకులు సేదదీరేందుకు నిర్మించిన డార్మిటరీ(విశ్రాంతి భవనం) శిథిలావస్థకు చేరింది. దీంతో దూర ప్రాంతాల నుంచి గుహలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులు ఇక్కట్టు పడుతున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి, సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Jun 07 , 2026 | 12:18 AM