దిగుబడి ఉన్నా ధర లేదు
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:22 AM
మార్కెట్‌లో మొక్కజొన్న దిగుబడికి ధర ఉన్నా, దిగుబడి లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలో రైతులు మొక్కజొన్నను సాగుచేశారు. తీరా దిగుబడి వచ్చాక ధర పడిపోవడంతో దక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ఎల్‌నినో ప్రభావంతో తగ్గిన మొక్కజొన్న దిగుబడి
నష్టపోయిన రైతులు
రుద్రవరం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): మార్కెట్‌లో మొక్కజొన్న దిగుబడికి ధర ఉన్నా, దిగుబడి లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలో రైతులు మొక్కజొన్నను సాగుచేశారు. తీరా దిగుబడి వచ్చాక ధర పడిపోవడంతో దక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ఎకరాకు రూ.30వేల పెట్టుబడి
మొక్కజొన్న సాగుకు రైతులు ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టారు. దీనికి తోడు కౌలు రైతులు రూ.30వేల కౌలుతో పెట్టుబడి భారంగా మారింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాకు రూ.2700 పలుకుతోంది.
ఎల్‌నినోతో తగ్గిన దిగుబడి
వాతావరణం అనుకూలిస్తే సాధారణంగా ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చేంది. కానీ ఈ ఏడాది 15 నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే రావడంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మీరు దారుణంగా మారింది. ఎల్‌నినో వర్షాలు తగినంతగా కురియకపోవడంతో దిగుబడిపై ప్రభావం చూపిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
దిగుబడి తగ్గింది
మొక్కజొన్న దిగుబడి తగ్గడంతో నష్టపోయా. మార్కెట్‌లో ధర బాగా ఉన్నా 20 క్వింటాళ్లు మాత్రమే రావడంతో నష్టపోయాను. - బాలవీరయ్య, రైతు, ముత్తలూరు
ధర ఉన్నా ప్రయోజనం లేదు
ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. ఈ ఏడాది మార్కెట్‌లో ధర ఉన్నా దిగుబడి తగ్గడంతో ప్రయోజనం లేదు. ఎకరాకు 30 నుంచి 35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను. - మహానంది, రైతు, నల్లవాగుపల్లె