కనిపించని చినుకు జాడ..
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:34 AM
ఎల్‌నినో ప్రభావంతో మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఖరీ్‌ఫలో సాధారణ సాగు విస్తీర్ణం 5వేల ఎకరాలు కాగా, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 4వందల ఎకరాల్లో మాత్రమే మినుము, పత్తి, ఆముదం, పెసర, మిరప సాగుచేశారు.
పనిచేయని బోర్లు, ఎండుతున్న పంటలు
కొలిమిగుండ్ల, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఖరీ్‌ఫలో సాధారణ సాగు విస్తీర్ణం 5వేల ఎకరాలు కాగా, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 4వందల ఎకరాల్లో మాత్రమే మినుము, పత్తి, ఆముదం, పెసర, మిరప సాగుచేశారు.
కనిపించని చినుకుజాడ..
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నా, కొలిమిగుండ్ల మండలంలో చినుకుజాడ లేదు. దీంతో మొక్కలు బెట్టకు గురై ఎండిపోతున్నాయి. మండలంలోని అబ్దుల్లాపురం,చింతలాయపల్లె, అంకిరెడ్డిపల్లె, కొలిమిగుండ్ల, ఉమ్మాయిపల్లె, తదితర గ్రామాల్లో సుమారు వంద బోరు బావులున్నాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోరు బావులు పనిచేయడం లేదు. దీంతో బోర్ల కింద సాగుచేసినా పంటలను కాపాడుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. వర్షం కోసం ఆశతో ఎదురుచూ స్తున్నారు. ప్రభుత్వం కొలిమిగుండ్లను కరువు మండలంగా ప్రకటించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.