Share News

ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - May 17 , 2026 | 12:11 AM

గ్రామాలను ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దుతామని ఆర్‌అండ్‌ బీ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛ దివాస్‌ పురస్కరించుకుని సంజామలలో జరిగిన స్వర్ణ ఆఽంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర లో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
ప్రతిజ్ఞ చేస్తున్న మంత్రి, అధికారులు

మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి

సంజామల, మే 15 (ఆంధ్రజ్యోతి): గ్రామాలను ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దుతామని ఆర్‌అండ్‌ బీ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛ దివాస్‌ పురస్కరించుకుని సంజామలలో జరిగిన స్వర్ణ ఆఽంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర లో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. దుకాణదారులు, ప్రజలతో మాట్లాడుతూ ప్లాస్టిక్‌ నిషేధానికి సహకరించాలని కోరారు. ఈ విషయమై తన సతీమణి బీసీ ఇందిరమ్మ మూడు నెలల పాటు ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించడంతో ప్లాస్టిక్‌ వినియోగం 70శాతం తగ్గిందన్నారు. చెత్తను డ్రైనేజీలో వేయవద్దని, చెత్త సేకరణ వాహనాలు వచ్చినప్పుడు అప్పగించాలని కోరారు. అనంతరం పీహెచ్‌సీని తనిఖీ చేసి, అధ్వానంగా ఉన్న పడకలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయాన మంత్రి పడకలపై ఉన్న వ్యర్ధాలను తొలగించారు. మరోసారి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటే చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య సిబ్బందిని హెచ్చరించారు.మండల పరిషత్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండేకంటి కిరణ్‌ కుమార్‌, మంచాల మద్దిలేటి రెడ్డి, కేశవ రెడ్డి, తులసిరెడ్డి, శంకర్‌ రెడ్డి, వీరప్రతాప్‌ రెడ్డి, మద్దిలేటి, మల్కి హుస్సేన్‌, ప్రతాప్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి, ముక్కమల్ల చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంపీడీవో సాలమోన్‌, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2026 | 12:11 AM