Share News

మొదటిరోజు ఒక్కరూ రాలేదు

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:48 AM

మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు బుధవారం మొదటి రోజు నామినేషన్లు దాఖలు కాలేదని ఆర్‌వో చిలకల విజయ శేఖర్‌, ఏఆర్‌వో శివమల్లేశ్వరప్ప తెలిపారు. ఎస్‌ఐ మధుసూదన బందోబస్తు ఏర్పాటు చేశారు.

మొదటిరోజు ఒక్కరూ రాలేదు
బేతంచెర్లలో విధులు నిర్వహిస్తున్న ఆర్‌వో బషీరున్నీసా బేగం

ఎంపీటీసీ ఎన్నికలకు తొలిరోజు నామినేషన్లు వేయని అభ్యర్థులు.. రుద్రవరంలో మూడు దాఖలు

శుక్రవారం సాయంత్రం వరకు గడువు..

శిరివెళ్ల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు బుధవారం మొదటి రోజు నామినేషన్లు దాఖలు కాలేదని ఆర్‌వో చిలకల విజయ శేఖర్‌, ఏఆర్‌వో శివమల్లేశ్వరప్ప తెలిపారు. ఎస్‌ఐ మధుసూదన బందోబస్తు ఏర్పాటు చేశారు.

బేతంచెర్ల: మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా బుధవారం ఒక్కరూ కూడా నామినేషన్‌ వేయలేదని ఆర్‌వో బషీరున్నిసా బేగం, ఏఆర్‌వో ఫజల్‌ రెహమాన్‌ బుధవారం తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు స్వీకరించే అవకాశముందని అభ్యర్థులు గమనించాలని కోరారు. సీఐ వెంకటేశ్వర్‌, ఎస్‌ఐ రమేష్‌ బాబు బందోబస్తు నిర్వహించారు.

బనగానపల్లె: ఎంపీటీసీ ఎన్నికలకు బుధవారం ఒక్క నామినేషన్‌ దాఖలు కాలేదని రిటర్నింగ్‌ అధికారి సుధాకర్‌ బుధవారం తెలిపారు. మొత్తం 29 ఎంపీటీసీ స్థానాలకు గాను ఈనెల 23వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు.

కొలిమిగుండ్ల: బుధవారం ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని ఆర్‌వో హరినాధ్‌ రెడ్డి సూచించారు. మొత్తం 15 ఎంపీటీసి స్థానాలకు శుక్రవారం సాయంత్రం లోపు నామినేషన్‌ వేయవచ్చన్నారు. నామినేషన్‌ వేసేందుకు సమస్యలు ఉంటే అభ్యర్ధులు హెల్ప్‌డె్‌స్కను ఆశ్రయించవచ్చని సూచించారు.

దొర్నిపాడు: 7 ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు బుధవారం నామినేషన్లు ఏమీ రాలేదని ఆర్‌వో నాగరాజు, ఎంపీడీవో సావిత్రి తెలిపారు. ఈ నెల 23 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని అభ్యర్థులు గమనించాలని కోరారు.

అవుకు: మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు మొదటి రోజు ఒక్క నామినేషన్‌ కూడ దాఖలు కాలేదని ఆర్‌వో వేణుగోపాల్‌ బుధవారం తెలిపారు. మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు ఉనన్నాయని 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. సీఐ మంజునాథరెడ్డి, ఎస్‌ఐ అశోక్‌ పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు.

ప్యాపిలి: ఎంపీటీసీ ఎన్నికలకు బుధవారం మొదటి రోజు నామినేషన్లు దాఖలు కాలేదని ఆర్‌వో శ్రీనివాసరావు తెలిపారు. సీఐ వెంకటరామిరెడ్డి నామినేషన్‌ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కోవెలకుంట్ల: ఎంపీటీసీ ఎన్నికలకు మొదటి రోజు ఒక్కరు కూడా నామినేషన్‌ వేయలేదని ఆర్‌వో చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు పవన్‌ కుమార్‌ రెడ్డి, ఎంపీడీవో నాగశివ ప్రసాద్‌ పాల్గొన్నారు. సీఐ హనుమంతు నాయక్‌ బందోబస్తు నిర్వహించారు.

రుద్రవరంలో మూడు నామినేషన్లు..

రుద్రవరం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిలకలూరు ఎంపీటీసీ స్థానానికి మూడు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్‌వో మనోరంజన్‌ ప్రతాప్‌ తెలిపారు. టీడీపీ తరపున చెందిన లక్ష్మిదేవి, సువర్ణ, లక్ష్మినరసమ్మ నామినేసను దాఖలు చేసినట్లు తెలిపారు. ఎన్నికల అఽధికారులు భాగ్యలక్ష్మి, నాగవీణ పాల్గొన్నారు. నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన సీఐ నామినేషన్ల కేంద్రాన్ని సీఐ ప్రవీణ్‌కుమారరెడ్డి, ఎస్‌ఐ మహ్మద్‌రఫి బుధవారం పరీశీలించారు.

Updated Date - Oct 22 , 2026 | 12:48 AM