Share News

పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల్లో తప్పులు రానివ్వం

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:45 AM

రైతులకు పంపిణీ చేసే పట్టాదారు పుస్తకాల్లో తప్పులు లేకుండా చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టరు సూరజ్‌ ధనుంజయ్‌ తెలిపారు

పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల్లో తప్పులు రానివ్వం
అర్జీలను స్వీకరిస్తున్న జేసీ సూరజ్‌ ధనుంజయ్‌

జేసీ సూరజ్‌ ధనుంజయ్‌

బనగానపల్లెలో దరఖాస్తుల స్వీకరణ

బనగానపల్లె, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): రైతులకు పంపిణీ చేసే పట్టాదారు పుస్తకాల్లో తప్పులు లేకుండా చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టరు సూరజ్‌ ధనుంజయ్‌ తెలిపారు. కలెక్టర్‌ రాజకుమారి ఆదేశాల మేరకు సోమవారం తహసీల్దారు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆర్డీవో నరేంద్రనాథరెడ్డి, తహసీల్దారు చంద్రశేఖర్‌ సమక్షంలో రైతులు, ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. ముద్రణ కారణాలతో ఆలస్యమైందని, రైతులందరికీ అందజేస్తామన్నారు. ఆధార్‌ కార్డులో తప్పులు, పోటో సరిగా లేకపోవడాన్ని సరిదిద్ది పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జూలైలో అప్పలాపురం, కాపులపల్లె గ్రామాలకు చెందిన రైతులకు ఇస్తామన్నారు. రైతులు, ప్రజల నుంచి 36 దరఖాస్తులు అందినట్లు ఆర్డీవో నరేంద్రనాథరెడ్డి తెలిపారు. ప్రతి రైతు ఈకెవైసీ చేయించుకోవాలని కోరారు. ఎంపీడీవో నాగరాజు, సర్వేయర్‌ మురళి, డీఈలు నాగశ్రీనివాసులు, వేణుగోపాల్‌, ఏఈ సాయికృష్ణ, ఏఈ హుసేన్‌, ఎంఈవో స్వరూప, విద్యుత్‌ ఏఈ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 12:45 AM