Share News

పచ్చదనం కనిపిస్తే ఒట్టు!

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:08 AM

జాతీయ రహదారి-44 నిర్వహణను జాతీయ రహదారుల అధికారులు గాలికి వదిలేశారని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు. డివైడర్ల మధ్య మొక్కలు లేవు, కొన్నిచోట్ల ఎండిపోయి కనిపిస్తున్నాయి.

పచ్చదనం కనిపిస్తే ఒట్టు!
ప్యాపిలి సమీపంలో డివైడర్లపై కనిపించని మొక్కల జాడ

ఎన్‌హెచ్‌-44పై వాహనదారులకు ముప్పు

ప్యాపిలి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి-44 నిర్వహణను జాతీయ రహదారుల అధికారులు గాలికి వదిలేశారని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు. డివైడర్ల మధ్య మొక్కలు లేవు, కొన్నిచోట్ల ఎండిపోయి కనిపిస్తున్నాయి. మండలంలోని ప్యాపిలి, పోతుదొడ్డి, ఏనుగమర్రి, వెంగళాంపల్లి తదితర గ్రామాల మీదుగా హైవే వెళుతోంది. అయితే ఈ రహదారి నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. మొక్కలు లేకపోవడంతో రాత్రిళ్లు అవతలివైపు నుంచి వచ్చే వాహనాల లైట్లు ఇవతలవైపు వాహనాలపై పడి చోదకులకు డివైడర్‌ సరిగా కనిపించడం లేదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంది. హైవే అధికారులు స్పందించి, మొక్కలను నాటి, వాటిని నీరు పోసేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Apr 19 , 2026 | 12:08 AM