మూగ రోదన
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:23 AM
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు మూగజీవాను సైతం ఇబ్బంది పెడుతున్నారు. పచ్చిక తగ్గిపోవడంతో గొర్రెలు, మేకలు ఆకలితో అలమటిస్తున్నాయి.
ఎల్‌నినో ప్రభావంతో పచ్చిక కరువు
గొర్రెలు, మేకలను పోషించలేక కాపరుల అవస్థలు
కొలిమిగుండ్ల, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు మూగజీవాను సైతం ఇబ్బంది పెడుతున్నారు. పచ్చిక తగ్గిపోవడంతో గొర్రెలు, మేకలు ఆకలితో అలమటిస్తున్నాయి.
మూడు నెలలుగా లేని చినుకుజాడ
మండలంలో మూడు నెలలుగా సరైన వర్షం కురవలేదు. దీంతో పొలాలు ఎండిపోయాయి, పచ్చిక దొరకడం లేదు. దీంతో గొర్రెల కాపరులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని మీర్జాపురం, పెట్నీకోట, నాయినిపల్లె, కొలిమిగుండ్ల, కోటపాడు తదితర గ్రామాల్లో సుమారు 20వేల గొర్రెలు, మేకలు ఉన్నాయి. ఎక్కడ చూసినా బీడు భూములు దర్శనమిస్తుండటంతో గొర్రెలు, మేకలకు మేత దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు. కుంటలు, చెరువుల్లో నీరులేకపోవడంతో పశుగ్రాసం కనిపించడం లేదు. తప్పని పరిస్థితుల్లో కాపరులు జీవాలను నంద్యాల, కోవెలకుంట్ల దూర ప్రాంతాలకు మందతో కలిసి వెళుతున్నారు. అక్కడ సైతం ఇలాగా ఉందని ఏమి చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. ప్రభుత్వం జీవాలకు గ్రాసాన్ని అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు.