గంజాయికి చెక్..
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:51 AM
సబ్ డివిజన్‌లో గంజాయి నియంత్రణకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. గంజారుకి బానిసగా మారితే కలిగే దుష్పలితాలపై పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలు, చుట్టు పక్కల గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
డ్రగ్స్ వద్దు బ్రో.. పేరుతో ప్రభుత్వం, పోలీసుల చర్యలు
విద్యార్థులకు విస్తృతంగా అవగాహన
డోన్ రూరల్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): సబ్ డివిజన్‌లో గంజాయి నియంత్రణకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. గంజారుకి బానిసగా మారితే కలిగే దుష్పలితాలపై పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలు, చుట్టు పక్కల గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత డిసెంబరులో డోన్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతంలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి కేజీ 250 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. వీరిని రిమాండ్‌కు పంపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మొత్తం మీద టీడీపీ హయాంలో డ్రగ్స్ నియంత్రణకు పకడ్బంధీగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. యువత వీటిపై అహగాన పెంచుకుని, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే మేలు.
డ్రగ్స్ వద్దు బ్రో..
టీడీపీ ప్రభుత్వం వచ్చాక ‘డ్రగ్స్ వద్దు బ్రో..’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాశాలలు, విద్యా సంస్థల్లో ప్రొజెక్టర్ల ద్వారా స్ర్కీన్ మీద డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. డీఎస్పీ పి.శ్రీనివాస్ పర్యవేక్షణలో పట్టణ, రూరల్ పోలీసులు గంజాయి నియంత్రణకు విద్యార్థులు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు.
గంజాయి నియంత్రణకు చర్యలు
డోన్ ప్రాంతంలో గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాము. అనుమానితులపై నిఘా ఉంచాము. గంజాయి విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాసులు, డీఎస్పీ, డోన్.