తిండి తిప్పలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:53 PM
పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బందికి తిండి తిప్పలు తప్పడం లేదు. నాసికం భోజనం పంపిణీ చేయడంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన చేపట్టారు.
నాసిరకం భోజనం ఫ ఎన్నికల సిబ్బంది ఆగ్రహం
అధికారుల ముందే ఆందోళన
ఎమ్మిగనూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బందికి తిండి తిప్పలు తప్పడం లేదు. నాసికం భోజనం పంపిణీ చేయడంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన చేపట్టారు. ఎమ్మిగ నూరు మండలంలోని జరిగే పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వ హించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. శనివారం వారంత పట్టణంలోని వీవర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ సామగ్రి పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు. వీరికి మధ్యాహ్నం భోజనంలో విజిటేబుల్ రైస్ అందించారు. వీటిలోకి ఎలాంటి కూరలు, పొడికాని ఇవ్వకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల అధికారుల ముందే ఆందోళనకు దిగారు. భోజనాన్ని చూపు తూ ఎలా తినాలని ప్రశ్నించారు. పేపర్ ప్లేట్లు కూడా పూర్తిగా నాసిరకంగా ఉన్నా యన్నారు. దాదాపు 658మంది ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వస్తున్నారని తెలిసినా స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి సరైన భోజన వసతి ఏర్పాటు చేయకపోవటం పట్ల సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈవిషయంపై ఎంపీడీవో బంగారమ్మను వివరణ కోరగా విజిటబుల్ రైస్‌లోకి కర్రీ వేయాలని చెప్పామని, ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఆకలితో అలమటించారు
గోనెగండ్ల: మండలంలో వివిధ గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల విధులకు దాదాపు 800 మంది సిబ్బంది వచ్చారు. వంట నిర్వాహకులు కేవలం 700 మందికి మాత్రమే భోజనాలు వండారు. బోజనం ఏర్పాటుకు కేవలం ఒకే కౌంటర్ ఏర్పాటు చేయడంతో సిబ్బంది క్యూకట్టి అరగంట పైగానే ఎండలో నిలబడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 70 మందికి పైగా భోజనాలు దొరక్కపోవడంతో ఆకలితో అలమటించారు. గ్రామంలోని హొటళ్లలో టిఫిన్లు తిని, కూల్‌డ్రింక్స్ తాగి తమ ఆకలిని తీర్చుకున్నారు. ఎంపీడీవో కార్యాలయం ఆధికారులకు తమ గోడును వివరించారు. వారు కూడా తమ చేతిలో ఏమీ లేదంటూ చేతులెత్తేశారు.