Share News

పత్తాలేని ఉద్యోగులు

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:01 PM

మండలంలో సచివాలయాలు, రైతు సేవా కేంద్రాల ఉద్యోగులు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తూ విధులకు గైర్హాజరవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏమాత్రం మయపాలన పాటిం చడం లేదని, గురువారం ఉదయం 11 గంటలు దాటినా ఎవరూ రాలేదని ఆరోపిస్తున్నారు

పత్తాలేని ఉద్యోగులు
లొద్దిపల్లెలో తెరుచుకోని రైతు సేవా కేంద్రం... లొద్దిపల్లె సచివాలయంలో ముగ్గురే ఉద్యోగులు

తెరుచుకోని రైతు సేవాకేంద్రం, సచివాలయంలో ముగ్గురే హాజరు..

ఓర్వకల్లు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో సచివాలయాలు, రైతు సేవా కేంద్రాల ఉద్యోగులు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తూ విధులకు గైర్హాజరవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏమాత్రం మయపాలన పాటిం చడం లేదని, గురువారం ఉదయం 11 గంటలు దాటినా ఎవరూ రాలేదని ఆరోపిస్తున్నారు. మండలంలోని లొద్దిపల్లె రైతు సేవా కేంద్రం ఉదయం 11 గంటలు దాటినా కార్యాలయానికి తాళం వేసిఉంది. అలాగే సచివాలయంలో ఉదయం 10.30 గంటలైనా ఇద్దరు ఉద్యోగులు మాత్రమే హాజరయ్యారు. 7 మంది విధులకు గైర్హాజరయ్యారు. అధికారులు ఏమాత్రం తనిఖీ చచేయకపోవడంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 22 , 2026 | 11:01 PM