విద్యుత్ లేక.. సాగునీరందక
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:17 AM
మండలంలోని పెద్దకంబలూరు గ్రామ పరిధిలో మూడురోజులుగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 200 ఎకరాల్లో బోరుబావుల కింద వరి నారు వేశారు.
ద్దకంబలూరులో ఎండిపోతున్న వరినారు
రుద్రవరం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దకంబలూరు గ్రామ పరిధిలో మూడురోజులుగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 200 ఎకరాల్లో బోరుబావుల కింద వరి నారు వేశామనానరు. అయితే విద్యుత్ సరఫరా లేకపోవడంతో బోరులో నీరున్నా అందడం లేదని వాపోతున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి సరఫరా సక్రమంగా అయ్యేలా చూడాలని కోరుతున్నారు.
మొలకదశలో ఎండిపోయిన నారుమడి
బోరుబావి కింద వరి నారు వేశాను. మూడురోజులుగా విద్యుత్ సరఫరా లేదు. దీంతో నారుమడి మొలక దశలోనే ఎండిపోయి, నిరాశపరిచింది. విద్యుత్ అధికారులను అడిగితే లైన్‌లో ససమ్య ఉందంటున్నారు. - రఫి, రైతు.
గాలి ప్రభావంతో సమస్య తలెత్తింది
పెనుగాలులు వీయడంతో పెద్దకంబలూరు త్రీఫేజ్ లైన్‌లో సమస్య తలెత్తింది. సరఫరా ఆగిపోవడంతో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే సరఫరాను పునరుద్ధరిస్తాం. - రాజశేఖర్, ఇన్‌ఛార్జి విద్యుత్ ఏఈ