అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:29 PM
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్
నంద్యాల నూనెపల్లి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. అధికారుల పీజీఆర్‌ఎస్ లాగిన్‌లలో ఇప్పటివరకు పరిశీలించని 135 దరఖాస్తులను వెంటనే ఓపెన్ చేయాలని, అలాగే రీఓపెన్ 13 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఏకు వెళ్లకుండా నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. ప్రతి అర్జీపై తీసుకున్న చర్యలను పీజీఆర్‌ఎ్‌సలో నమోదు చేయాలని సూచించారు. పీజీఆర్‌ఎస్ ద్వారా మొత్తం 299 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ ద్వారా 158 అర్జీలు స్వీకరించినట్లు జేసీ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో రామునాయక్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.