Share News

ఫిషర్‌మెన్‌ కో ఆపరేటివ్‌ చైర్మన్‌పై వీగిన అవిశ్వాసం

ABN , Publish Date - May 02 , 2026 | 12:24 AM

జిల్లా ఫిషర్‌ మెన్‌ కో ఆపరేటివ్‌ యూనియన్‌ అధ్యక్షుడు నవీన్‌పై కొంత మంది డైరెక్టర్లు గత నెల అవిశ్వాసాన్ని ప్రకటించారు. వెంటనే మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని, నవీన్‌పై మెజారిటీ సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని తెలుపుతూ మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రంగనాథబాబుకు లెటర్‌ అందజేశారు.

ఫిషర్‌మెన్‌ కో ఆపరేటివ్‌ చైర్మన్‌పై వీగిన అవిశ్వాసం

11 మందికి గాను ఐదుగురే హాజరు

కోరం లేక జరగని మీటింగ్‌

కర్నూలు అగ్రికల్చర్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఫిషర్‌ మెన్‌ కో ఆపరేటివ్‌ యూనియన్‌ అధ్యక్షుడు నవీన్‌పై కొంత మంది డైరెక్టర్లు గత నెల అవిశ్వాసాన్ని ప్రకటించారు. వెంటనే మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని, నవీన్‌పై మెజారిటీ సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని తెలుపుతూ మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రంగనాథబాబుకు లెటర్‌ అందజేశారు. ఇందులో భాగంగా డిప్యూటీ డైరెక్టర్‌ రంగనాథ బాబు శుక్రవారం అవిశ్వాస తీర్మానం నోటీసును జారీ చేసి సమావేశాన్ని నిర్వహించారు. అయితే.. ఈ సమావేశానికి అవసరమైన కోరం ఉండాలంటే 8 మంది సభ్యులు హాజరు కావాలి. కానీ ఐదుగురు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. మిగిలిన వారు హాజరు కాలేదు. ప్రధానంగా ఈ అవిశ్వాస తీర్మాన సమావేశానికి గూడూరు శ్రీనివాసులు, చిన్నటేకూరు మల్లే్‌షగౌడు, చేబోలు చెందిన వెంకటేశ్వర్లు, మద్దికెర నుంచి భాస్కర్‌, నర్సాపురం నుంచి నాగశేషులు హాజరయ్యారు. కేవలం ఐదుగురు మాత్రమే హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అవకాశం లేదని డిప్యూటీ డైరెక్టర్‌ రంగనాథ బాబు తెలపడంతో సమావేశం వాయిదా పడింది. దీంతో ఫిషర్‌ మెన్‌ కో ఆపరేటివ్‌ చైర్మన్‌గా నవీన్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగినట్లయింది.

Updated Date - May 02 , 2026 | 12:24 AM