పొగాకు నాణ్యతపై రాజీ లేదు
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:12 AM
చుక్కబర్లి పొగాకు నాణ్యతపై రాజీ ఉండదని ఐటీసీ ఎండీ దీక్షిత్ అన్నారు. గురువారం ఓర్వకల్లులోని ఐటీసీ గోదాములోని ప్రాంగణంలో ముఖాముఖి చర్చ జరిపారు.
ఐటీసీ ఎండీ దీక్షిత్
ఓర్వకల్లు, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): చుక్కబర్లి పొగాకు నాణ్యతపై రాజీ ఉండదని ఐటీసీ ఎండీ దీక్షిత్ అన్నారు. గురువారం ఓర్వకల్లులోని ఐటీసీ గోదాములోని ప్రాంగణంలో ముఖాముఖి చర్చ జరిపారు. రైతులు సమస్యలను కంపెనీ యాజమాన్యానికి వివరించారు. దీక్షిత్ మాట్లాడుతూ పొగాకు సాగులో కంపెనీ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేయాలని రైతులను కోరారు. కంపెనీ సూచనలు, మార్గదర్శకాలను అనుసరించి రైతులు నాణ్యమైన దిగుబడులు సాధించాలన్నారు. నాణ్యతకు తగిన గిట్టుబాటు ధర కూడా చెల్లిస్తుందన్నారు. రైతుల అభివృద్ధికి కంపెనీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పొగాకు ఆకుల నాణ్యత దెబ్బతినకుండా నీడలో షెడ్డు ఏర్పాటుచేసి సరైన పద్ధతిలో నిల్వ చేయాలని సూచించారు. రిజిస్టర్ చేసుకున్న రైతులందరూ కంపెనీ సూచనలను పాటిస్తూ నాణ్యమైన పొగాకును ఉత్పత్తిచేసి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని కోరారు. ఏరియా మేనేజర్ ప్రసాద్, ఖాజా, రైతులు పాల్గొన్నారు.