శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు
ABN , Publish Date - Apr 10 , 2026 | 10:52 PM
నేరాల నియంత్రణ, పెండింగ్ కే సుల దర్యాప్తుతో పాటు నేరస్థులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దని ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు.
నేర సమీక్షలో ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల క్రైం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణ, పెండింగ్ కే సుల దర్యాప్తుతో పాటు నేరస్థులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దని ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు. పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాస్థాయి పోలీసు అధికారులతో శుక్రవారం నేర సమీక్ష నిర్వహించారు. పోలీసు స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులు, వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టులు, దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రాపర్టీ నేరాలకు పాల్పడే వారిపై అవసరమైతే షీట్స్ ఓపెన్ చేయాలని ఆయన ఆదేశించారు. నేరస్థుల గుర్తింపులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. పోలీసు స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించుకోవాలని, నిర్ణీత గడువులోగా పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు. అనంతరం మహిళల భద్రత, సైబర్ క్రైమ్, శాంతిభద్రతల పరిరక్షణ, గ్రేవ్, నాన్‌గ్రేవ్ కేసులు, హత్యలు, ప్రాపర్టీ, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించి పలు సూచనలు చేశారు. తరచూ బీట్ చెకింగ్ చేస్తూ సిబ్బందికి సూచనలివ్వడంతోపాటు దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే రోడ్డు రవాణా సంస్థ వారి సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను త్వరితగతిన ట్రయల్‌కు వచ్చేలా చూడాలని, నేరాలకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రశంసా పత్రాల అందజేత
కేసుల దర్యాప్తు, పరిష్కారం, ప్రాపర్టీ నేరాల్లో నిందితుల అరెస్టు, బందోబస్తు విధులు తదితర వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 36 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. అధికారులు, సిబ్బంది సేవలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.