Share News

ఆరు బయటే సమావేశం

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:18 AM

మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామంలో పొదుపు భవనం లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆరు బయటే సమావేశం
ఆలయం వద్ద సమావేశం నిర్వహిస్తున్న పొదుపు మహిళలు

అంకిరెడ్డిపల్లెలో పొదుపు మహిళల ఇబ్బందులు

కొలిమిగుండ్ల, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామంలో పొదుపు భవనం లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆరుబయటే సమావేశాలు నిర్వహించుకోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 5 గ్రామైఖ్య సంఘాలు ఉండగా, 170 పొదుపు గ్రూపుల్లో సుమారు 1,700మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం మహిళలకు రుణాలు, ప్రోత్రాహకాలు, అందజేస్తోంది. దీంతో గ్రామాల్లో పొదుపు గ్రూపులపై మహిళల్లో చైతన్యం వచ్చింది. ప్రతి మహిళ పొదుపు పథకాల ద్వారా రుణాలు పొంది, స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్నారు. రాత్రి సమాయాల్లోనే ఎక్కువగా సమావేశం ఉండటంతో చెట్లకింద, ఆలయాల వద్ద, రచ్చబండల వద్ద సమావేశాలు నిర్వహించాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. విషపురుగుల ప్రమాదం ఉందని ప్రభుత్వం పొదుపు భవనం నిర్మించాలని కోరుతున్నారు.

Updated Date - Apr 02 , 2026 | 12:18 AM