శ్రీశైలంలో నూతన క్యూ కాంప్లెక్స్
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:44 PM
శ్రీశైల క్షేత్రంలో భక్తుల సౌక ర్యార్థం రాబోయే 50 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా అధు నాతన సౌకర్యాలతో కూడిన క్యూంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుడుతు న్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు సంయుక్తంగా ప్రకటించారు.
ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో భక్తుల సౌక ర్యార్థం రాబోయే 50 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా అధు నాతన సౌకర్యాలతో కూడిన క్యూంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుడుతు న్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు సంయుక్తంగా ప్రకటించారు. మంగళవారం దేవదా యశాఖ చీఫ్ ఇంజనీరు జీవిఆర్ శేఖర్‌తో కలిసి కన్సల్టెన్సీ నిపుణులు శ్రీకృష్ణన్, దేవస్థానం ఈఈ మురళీ బాలకృష్ణ, డీఈ చంద్రశేఖరశాస్త్రి, ఏఈ భవన్‌కుమార్ ఆర్కిటెక్ ప్లాన్‌తోపాటు క్యూకాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ప్రధానంగా పరిపాలనా భవనం ముందు భాగం నుంచి వైద్యశాల వరకు సిద్ధం చేయనున్న క్యూకాంప్లెక్స్ రూపురేఖలు, సౌకర్యాలపై కీలక మార్పు చేర్పులు చేయనున్నట్లు తెలిపారు.