అందుబాటులో నూతన వైద్య విధానాలు
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:33 PM
ముకలు, కీళ్ల సమస్యలకు ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని, వీటి వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉందని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ జి.రఘునందన్ అన్నారు.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్
రాష్ట్ర స్థాయి ఆర్థోపెడిక్ వైద్యుల సదస్సు ప్రారంభం
కర్నూలు హాస్పిటల్, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ఎముకలు, కీళ్ల సమస్యలకు ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని, వీటి వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉందని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ జి.రఘునందన్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఆడిటోరియంలో శుక్రవారం ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 55వ ఆర్థోపెడిక్ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. వైద్యులతో కలిసి డీఎంఈవో జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. డీఎంఈ మాట్లాడుతూ ఆర్థోపెడిక్ వైద్యం అనేది కేవలం ఎముకల చికిత్సకే పరిమితం కాకుండా రోగి జీవన నాణ్యతను మెరుగు పరిచే కీలక విభాగమని అన్నారు. దేశ విదేశాలకు చెందిన 1200 మంది వైద్యులు ఈ సదస్సుకు హాజరయ్యారని చెప్పారు. ఈ సదస్సులో ఆర్థోపెడిక్ సర్జరీకి చెందిన ప్రొఫెసర్లతో పాటు ఆధునిక సాంకేతికతో కూడిన మినీమల్లి ఇన్వేసివ్ సర్జరీలు, ట్రామాకేర్, జాయింట్ రీప్లేస్‌మెంటు, ఆర్థోస్కోపి థెరపీ విధానాలు ఎంతో అవసరమన్నారు. ఇలాంటి రాష్ట్ర సదస్సులో యువ వైద్యులకు సీనియర్ సర్జన్లకు జ్ఞాన మార్పిడికి వేదికలుగా నిలుస్తాయన్నారు. కర్నూలులో 1992లో కేఎంసీలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శేషన్న ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగిందని, ఆ తర్వాత 34 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అయిన డా.శేషన్న డా.చంద్రన్నను సన్మానించారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు ఓసాప్కాన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డా.అశోక్ కుమార్, డా.విజయకృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ చైర్మన్ డా.కె.శ్రీనివాసులు, సెక్రటరీ డా.ఇలియాజ్ బాషా, కో-చైర్మన్ డా.వై.రమణ, సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డా.రాజయ్య, ఏపీఎంసీ అబ్జర్వర్ డా.వెంకటరమణతో కలిసి డీఎంఈ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.