Share News

పాణ్యం చెరువుకు కొత్త హంగులు

ABN , Publish Date - May 12 , 2026 | 11:15 PM

పాణ్యం చెరువు నూతన హంగులతో రూపుదిద్దుకోబోతున్నట్లు ఎమ్మెల్యే గౌరుచరిత తెలి పారు.

పాణ్యం చెరువుకు కొత్త హంగులు
పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గౌరుచరిత, కలెక్టరు రాజకుమారి

ఎమ్మెల్యే గౌరు చరిత

జలహారతి కింద వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటుకు భూమి పూజ

పాణ్యం, మే 12 (ఆంధ్రజ్యోతి) : పాణ్యం చెరువు నూతన హంగులతో రూపుదిద్దుకోబోతున్నట్లు ఎమ్మెల్యే గౌరుచరిత తెలి పారు. మంగళవారం కలెక్టరు రాజకుమారితో కలిసి చెరువు వద్ద పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంద న్నారు. జలధార, జల హారతి కార్యక్రమంలో భాగంగా జలవ నరుల సంరక్షణతో పాటు గ్రామీణ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు చెరువు కట్ట పరిసరాలను పర్యాటక , వినోద కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సుమారు రూ. 48 లక్షల అంచనా వ్యయంతో వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌, పార్కు, బెంచీలు, సోలార్‌ దీపాలు ఏర్పాటు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. చెరువులో పూడికను రైతులు స్వచ్ఛందంగా తమ వ్యవసాయ భూములకు తరలించుకునే అవకాశాన్ని కల్పిస్తుం దన్నారు. ఉపాధి హామీ కింద రూ. 4.5 లక్షల మేర సీడ్‌ అప్లికే షన్లు మంజూరయ్యాయన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తామని కలెక్టరు రాజకుమారి హామీ ఇచ్చారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా పశువుల సంరక్షణకు రూ. 10 లక్షల వ్యయంతో క్యాటిల్‌ హాస్టల్‌ నిర్మాణానికి స్థలం గుర్తించాలని డ్వామా పీడీ సూర్యనారాయణను ఆదేశించారు. చేపల పెంప కానికి రూ. 10 లక్షలతో ఫిష్‌పాండ్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలి పారు. స్థానిక హైస్కూల్‌ చుట్టూ కాంపౌండ్‌ నిర్మాణాన్ని రెండు విడతల్లో పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, తహసీల్దారు శివశంకరరెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్‌, ఎంఈవో కోటయ్య, ఎంపీటీసీ రంగరమేష్‌, టీడీపీ నాయకులు జయరామిరెడ్డి, ఖాదర్‌బాషా, రమణమూర్తి రామ్మోహన్‌నాయుడు, రవి, మానిట రింగ్‌ సభ్యులు దానం, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2026 | 11:15 PM