Share News

నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:18 AM

అంగనవాడీ కేంద్రాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని ఐసీడీఎస్‌ పీడీ విజయ హెచ్చరించారు.

నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు
అంగన్‌ వాడీ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న పీడీ విజయ

ఐసీడీఎస్‌ పీడీ విజయ

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): అంగనవాడీ కేంద్రాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని ఐసీడీఎస్‌ పీడీ విజయ హెచ్చరించారు. బుధవారం ఆమె నగరంలోని సర్ధార్‌ నాగప్పవీధి, ఎర్ర బురుజు తదితర ప్రాంతాల్లోని అంగన్‌ వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ నెలకొన్న సౌకర్యాల కొరత, సేవాలోపంపై సంబంధిత సిబ్బందిని నిలదీశారు. మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందించాలని, ప్రీ స్కూల్‌ విద్య, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. ఎర్రబురుజు-2లో అంగన్‌ వాడీ భవనం మార్పుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని, సిబ్బంది ప్రభుత్వం నిర్ధేశించిన యూనిఫాం ధరించాలని ఆదేశించారు. అంగన్‌ వాడీ కేంద్రాల్లో మెనూతోపాటు కేంద్రం బోర్డును ప్రదర్శించకపోవటం, పిల్లల హా జరు, నమోదులో వ్యత్యాసం, సమాచారం ఇవ్వకుండా సిబ్బంది విధులకు గైర్హాజరు కావటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి, వివరణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. తప్పిదాలు పదేపదే పునరా వృత్తం అయితే శాఖపరమైన కఠిన చర్యలు తప్పవన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 12:18 AM