Share News

నిర్లక్ష్యం తగదు

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:24 PM

ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నాణ్యమైన పరిష్కారాలు అందించాలని కలెక్టర్‌ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.

నిర్లక్ష్యం తగదు
వినతి పత్రాన్ని స్వీకరిస్తున్న కలెక్టర్‌ ఏ.సిరి

ఈవీఎం గోడౌన్‌ వద్ద పటిష్ట నిఘా ఉండాలి

కలెక్టర్‌ సిరి

కర్నూలు కలెక్టరేట్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నాణ్యమైన పరిష్కారాలు అందించాలని కలెక్టర్‌ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిదిక నుంచి వినతులను కలెక్టర్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సెప్టెంబరు 30 నాటికి 22ఏ కింద పరిష్కరించిన భూ సమస్యల వివరాలు తప్పనిసరిగా ఆన్‌లైన్‌ అడంగల్‌ పోర్టల్‌లో ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ఈవీఎంల భద్రతలో నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్‌ డా.ఏ. సిరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించాక గోదాము వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ మురళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 11:24 PM