సేవల్లో నిర్లక్ష్యం తగదు
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:50 PM
సమస్యల కోసం సచివాలయాలకు వచ్చే ప్రజలకు మర్యాద ఇచ్చి పనులు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, సమయానికి కార్యాలయానికి హాజరై అధి కారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో ఇతర సిబ్బంది పనిచేయాలని జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు అధికారి భాస్కర్ నాయుడు అన్నారు.
స్వర్ణ గ్రామ, వార్డు జిల్లా అధికారి భాస్కర్ నాయుడు
సచివాలయాల ఆకస్మిక తనిఖీ
మంత్రాలయం, జూన్ 23(ఆంధ్రజ్యోతి): సమస్యల కోసం సచివాలయాలకు వచ్చే ప్రజలకు మర్యాద ఇచ్చి పనులు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, సమయానికి కార్యాలయానికి హాజరై అధి కారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో ఇతర సిబ్బంది పనిచేయాలని జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు అధికారి భాస్కర్ నాయుడు అన్నారు. మంగళవారం మంత్రాలయం మండలంలోని మాధవరం సచి వాలయ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. ఆయన మాట్లడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా పన్నులు, ఇతర చెల్లింపులు ఆన్‌లైన్ ద్వారా జరగాలని సూచిం చారు. లక్ష్యాలను సాధించేందుకు ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు తక్ష ణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని అన్నారు. కుల, ఆదా య, సర్వే ధృవీకరణ పత్రాలు అధిక రుసుం తీసుకోకుండా ఇవ్వాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఎంపీడీవో నూర్జహాన్, డిప్యూటీ ఎంపీడీవో ఉపేంద్రరెడ్డి, గ్రామ కార్యదర్శి వేణుగోపాల్, మండల అధికారి ఆశాబేగం పాల్గొన్నారు.