Share News

విద్యారంగంపై నిర్లక్ష్యం తగదు

ABN , Publish Date - Aug 20 , 2026 | 11:37 PM

విద్యారంగంపై నిర్లక్ష్యం తగదని ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేశారు.

విద్యారంగంపై నిర్లక్ష్యం తగదు
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థులు, నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ ధర్నా

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): విద్యారంగంపై నిర్లక్ష్యం తగదని ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేశారు. విద్యార్థి నాయకులు మాట్లాడుతూ లీకేజీలకు కేంద్రంగా మారిన ఎన్‌టీఏను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను వెంటనే తెరిపించాలని, ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలలు, కళాశాలలో వృత్తి విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన విద్య, భోజనంతో పాటు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, అలాగే ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో అధిక ఫీజులపై ఫీజు నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కేజీబీవీల్లో జరిగిన టెండర్‌ అక్రమాలపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. జిల్లాలో వసతి గృహాల్లో విద్యార్థులు వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైద్య విద్యాసంస్థలను బలోపేతం చేయాలన్నారు. విద్యారంగంలో జరుగుతున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను అడ్డుకుని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా విద్య అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం పతకం డబ్బులు వెంటనే అందించాలన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగదని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శి సోమన్న, షాబీర్‌బాషా, జిల్లా సహాయ కార్యదర్శి శరత్‌ కుమార్‌, నగర కార్యదర్శి అభిరాం, కార్యవర్గ సభ్యులు, సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 11:37 PM