గ్లకోమాపై అప్రమత్తత అవసరం
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:48 AM
గ్లకోమా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు.
వాక్‌థాన ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్
కర్నూలు హాస్పిటల్, మార్చి 11(ఆంధ్రజ్యోతి): గ్లకోమా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. బుధవారం ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా కర్నూలు ప్రాంతీయ కంటి ఆసుపత్రి, జిల్లా అంథత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాక్‌థాన ర్యాలీని జేసీ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. కంటి చూపును హరించే నిశ్శబ్ద శత్రువు గ్లకోమా అని, క్రమం తప్పకుండా పరీక్ష లు చేయించుకోవడంతో అం థత్వాన్ని నివారించవచ్చునని అన్నారు. 40 ఏళ్లు పైబడిన వారు రెగ్యులర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఎం.సత్యనారాయణరెడ్డి, మార్చి 8 నుంచి 14వ తేదీ వరకు గ్లకోమా వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఈ ర్యాలీ కంటి ఆసుపత్రి నుంచి రాజ్‌విహార్ వరకు తిరిగి రాజ్‌విహార్ నుంచి కంటి ఆసుపత్రి వరకు కొనసాగింది. ర్యాలీలో డీఎం హెచవో డా.ఎల్.భాస్కర్, కంటి ఆసుపత్రి సీనియర్ ప్రొఫెసర్ డా.యుగంధర్ రెడ్డి, సుశీల నేత్రాలయ మెడికల్ డైరెక్టర్ డా.పి.సుధాకర్‌రావు, డా.నేహ సుధాకర్, జిల్లా అంథత్వ నివారణ సంస్థ కార్యదర్శి డా.హిమబిందు, మాడ్రన ఐ హాస్పిటల్ డా.రాజశేఖర్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా.రామచంద్ర నాయుడు, పీజీలు, వైద్యులు పాల్గొన్నారు.