Share News

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్షలు

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:11 PM

జవహర్‌ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రశాంతంగా జరిగినట్లు జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ పద్మావతి తెలిపారు.

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్షలు
పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న ప్రిన్సిపాల్‌ పద్మావతి

ఎమ్మిగనూరు టౌన్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి) : జవహర్‌ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రశాంతంగా జరిగినట్లు జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ పద్మావతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి 6,970 మంది అభ్యర్ధులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 5,379 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, మాచాని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, వీవర్స్‌ కాలనీలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Nov 28 , 2026 | 11:11 PM