Share News

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

ABN , Publish Date - Nov 27 , 2026 | 11:04 PM

జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2027-28 విదా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్ష శనివారం జరనుంది.

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

హాజరు కానున్న 6,970 మంది విద్యార్థులు

ఎమ్మిగనూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2027-28 విదా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్ష శనివారం జరనుంది. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 6,970 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లును బనవాసి నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ పద్మావతి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 12 కేంద్రాలు, కర్నూలు జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు కలిపి 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆలూరులో రెండు, ఆదోనిలో మూడు, ఎమ్మిగనూరులో నాలుగు పరీక్ష కేంద్రాలను ప్రిన్సిపాల్‌ సందర్శించి విద్యార్థులకు ఏర్పాటు చేసిన మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిర్ధేశించిన సమయానికి ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, అడ్మిట్‌ కార్డుతో పాటు అవసరమైన సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆమె తెలిపారు. అంతకు ముందు పరీక్ష కేంద్రాల సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు అందజేశారు. పరీక్ష ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.

Updated Date - Nov 27 , 2026 | 11:04 PM