12న జాతీయ లోక్ అదాలత్
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:23 PM
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి వెల్లడించారు.
ఫ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి
కర్నూలు లీగల్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సహకరించాలని కోరారు. బుధవారం కర్నూలు నగరంలోని న్యాయ సేవాసదన్ భవన్‌లో అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులు, భూసేకరణ కేసులు మున్సిపల్ ఇన్సూరెన్స్, బ్యాంకు కేసులను కూడా ఎటువంటి ఖర్చులు లేకుండా సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో వీలైనన్ని కేసులు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అందుకు గానూ ప్రతి రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని కోర్టులలో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌ను దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో తమ కేసులను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.