Share News

మే 9న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN , Publish Date - Apr 21 , 2026 | 10:57 PM

వచ్చే నెల 9వ తేదీన జరగబోయే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరిగే జాతీయ లోక్‌ అదా లత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి బి.లీలా వెంకట శేషాద్రి అధికారులను కోరారు.

మే 9న జాతీయ లోక్‌ అదాలత్‌
మాట్లాడుతున్న బి. లీలా వెంకట శేషాద్రి

కర్నూలు లీగల్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 9వ తేదీన జరగబోయే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరిగే జాతీయ లోక్‌ అదా లత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి బి.లీలా వెంకట శేషాద్రి అధికారులను కోరారు. జిల్లా ప్రధాన న్యా యాధికారి జి.కబర్ది ఆదేశాల మేరకు స్థానిక న్యాయ సేవాసదన్‌ భవన్‌లో సంబంధిత అధికారులతో ఆయన ఒక సమీక్ష సమావేశం నిర్వహిం చా రు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని కో ర్టులలో ఈ జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిం చబడు తుందని, పెం డింగ్‌లో ఉన్న కేసులు, ప్రిలిటిగేషన్‌ కేసులు, మోటార్‌ యాక్సిడెంట్‌ కే సులు, వాహన ప్రమాదాల కేసులు, బ్యాంక్‌, మున్సిపా లిటీ, బీఎస్‌ఎన్‌ ఎల్‌ తదితర ప్రభుత్వ రంగ సంస్థల పై దాఖలైన కేసుల ను పరిష్క రించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయో గించుకుని వారి కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించు కోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిద బ్యాంకుల మేనేజర్లు, పంచా యతీ ఆఫీసర్లు, మున్సిపల్‌, ఇన్సూరెన్స్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 10:57 PM