దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యం
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:12 PM
భారతదేశ అభివృద్ధి మోదీపాలనలోనే సాధ్యమని బీజేపీ జోనల్ ఇన్‌చార్జి దయాకర్ రెడ్డి అన్నారు.
బీజేపీ జోనల్ ఇన్‌చార్జి దయాకర్ రెడ్డి
బేతంచెర్ల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): భారతదేశ అభివృద్ధి మోదీపాలనలోనే సాధ్యమని బీజేపీ జోనల్ ఇన్‌చార్జి దయాకర్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని జీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో డోన్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీలో కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యకర్తలే కీలకమని, సాధారణ కార్యకర్త సైతం ఎంపీ, సీఎంలుగా చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. అందరు కలిసికట్టుగా స్థానిక సంస్ధల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు సంస్కరణలు తీసుకొచ్చి విద్య, వైద్యం, ఉపాధి, ఆర్ధిక, రక్షణ రంగాల్లో ప్రధానిగా మోదీ సమూల మార్పులు తీసుకొచ్చారన్నారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగమోహన్, కన్వీనర్లు ఆంజనేయులు, అశ్వత్థ నారాయణ, నాయకులు అరుణ్ కుమార్, మోహన్‌రావు, ఉపేంద్ర, సుబ్బారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రవి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.