Share News

పెద్దకడుబూరు పోలీస్‌ స్టేషన్‌కు జాతీయ అవార్డు

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:56 PM

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం పోలీస్‌ స్టేషన్‌ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్‌ స్టేషన్‌గా ఎంపికైంది.

పెద్దకడుబూరు పోలీస్‌ స్టేషన్‌కు జాతీయ అవార్డు
అవార్డు అందుకుంటున్న కర్నూలు పోలీసులు

డీజీపీ నుంచి సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ అవార్డు అందుకున్న జిల్లా పోలీసులు

కర్నూలు క్రైం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం పోలీస్‌ స్టేషన్‌ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్‌ స్టేషన్‌గా ఎంపికైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ అవార్డును ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌గా కర్నూలు జిల్లాలోని పెద్దకడుబూరు పోలీస్‌ స్టేషన్‌ ఈ అవార్డుకు ఎంపికైంది.. ఈ సందర్భంగా సర్టిఫికెట్‌ ఆప్‌ ఎక్స్‌లెన్సీ అవార్డును శుక్రవారం విజయవాడ మంగళగిరిలో ఏపీహెడ్‌ క్వార్టర్స్‌లో రాష్ట్ర డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా చేతుల మీదుగా, డీఐజీ కర్నూలు జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, కోసిగి సీఐ బిఏ మంజునాథ్‌, పెద్దకడుబూరు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అవార్డును అందుకోవడం జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని డీపీజీ పేర్కొన్నారు. డీఐజీ కర్నూలు జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ నేరాల అదుపు, నేర నియంత్రణ, సీసీ కెమెరాలు, త్వరితగతిన కేసుల దర్యాప్తు మొదలైన వాటి వల్ల ఈ అవార్డును పెద్దకడుబూరు పోలీస్‌ స్టేషన్‌కు ఎంపికైందన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 11:56 PM