Share News

వైభవంగా నరసింహస్వామి రథోత్సవం

ABN , Publish Date - May 01 , 2026 | 12:13 AM

మండలంలోని ముడుమలగుర్తిలో నరసింహస్వామి రథోత్సవం వైభవంగా జరి గింది.

వైభవంగా నరసింహస్వామి రథోత్సవం
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

కోడుమూరు రూరల్‌ ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని ముడుమలగుర్తిలో నరసింహస్వామి రథోత్సవం వైభవంగా జరి గింది. నవరత్నాల నరసింహస్వామి ఉత్సవాల్లో గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం వేదమంత్రోచ్ఛా రణల మధ్య స్వామిఅమ్మవార్ల కల్యాణం జరిపించి అన్నదానం చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను మేళతాళాల మధ్య తోడ్కొని వచ్చి సుందరంగా ముస్తాబు చేసిన రథంపై కొలువుదీ ర్చారు. వేడుకల సందర్బంగా కుడా మాజీ చైర్మన కోట్ల హర్షవర్ధనరెడ్డి, వైసీపీ ఇనచార్జి సతీష్‌ ఆలయంలో పూజలు నిర్వ హించిన అనంతరం క్రికెట్‌ టోర్నమెంటు ప్రారంభించారు.

Updated Date - May 01 , 2026 | 12:13 AM