Share News

నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:17 AM

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు కల్చరల్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. నగరంలోని ఎ.క్యాంపులోగల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం వద్ద ఉయ్యాలవాడ సేవా సమితి ఏర్పాటు చేసిన 179వ వర్థంతిలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా ఉ య్యాలవాడ విగ్రహానికి మంత్రి పూలదండలు వేసి నివాళులర్పించారు. టీజీ భరత్‌ మాట్లాడుతూ బ్రిటీషు పాలకుల అన్యాయాలపై ఉయ్యాల వాడ నరసింహారెడ్డి చేసిన పోరాటం నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. జోహరాపురంలోని పురాతన బావులను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉయ్యాలవాడ సేవా సమితి అధ్యక్షుడు విజయమోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డి, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్పొరేటర్‌ పద్మలతారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:17 AM