Share News

నంద్యాల జీజీహెచకు ఇద్దరు గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్లు

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:17 AM

వైద్యఆరోగ్యశాఖ రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో కడప ఆర్‌డీ డా.రామగిడ్డయ్య జోనల్‌ పరిధిలో ఉన్న నలుగురు సీనియర్‌ హెడ్‌ నర్సులకు గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్లుగా పదోన్నతి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

నంద్యాల జీజీహెచకు ఇద్దరు గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్లు
గ్రేడ్‌-2 సూపరింటెండెంట్లకు ఉత్తర్వులను అందిస్తున్న కడప ఆర్‌డీ డా.రామగిడ్డయ్య

పదోన్నతుల కౌన్సెలింగ్‌ నిర్వహించిన కడప ఆర్‌డీ

కర్నూలు హాస్పిటల్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): వైద్యఆరోగ్యశాఖ రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో కడప ఆర్‌డీ డా.రామగిడ్డయ్య జోనల్‌ పరిధిలో ఉన్న నలుగురు సీనియర్‌ హెడ్‌ నర్సులకు గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్లుగా పదోన్నతి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అనంతపురం జీజీహెచలో హెడ్‌ నర్సుగా పని చేస్తున్న కే.ఉమాదేవి, కర్నూలు జీజీహెచలో విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ హెడ్‌ నర్సు ఈ.కళావతి ఇద్దరు నంద్యాల జీజీహెచ గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్లుగా కడప ఆర్‌డీ పదోన్నతి కల్పించి పోస్టింగ్‌ ఇచ్చారు. డిప్యూటీ డైరెక్టర్‌ నాగరత్నమ్మ, ఆఫీసు సూపరింటెండెంట్‌ ఆళ్లె శ్రీనివాసులు, నర్సెస్‌ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షురాలు రాధమ్మ పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:17 AM