విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:57 PM
విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీల్ షెరాన్ పోలీసు అధికారులకు సూచించారు. రుద్రవరంలోని మండల పరిషత్‌లోని నామినేషన్ల పరిశీలన కేంద్రాన్ని శనివారం ఎస్పీతో పాటు సబ్ కలెక్టరు మనీషా పరిశీలించారు.
రుద్రవరం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీల్ షెరాన్ పోలీసు అధికారులకు సూచించారు. రుద్రవరంలోని మండల పరిషత్‌లోని నామినేషన్ల పరిశీలన కేంద్రాన్ని శనివారం ఎస్పీతో పాటు సబ్ కలెక్టరు మనీషా పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నామినేషన్ కేంద్రాల వద్ద అనధికార వ్యక్తులు గుమికూడకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామాంజనేయులు, సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ మహ్మద్‌రఫీ తదితరులు ఉన్నారు.
నామినేషన్ల పరిశీలనకు పటిష్ట బందోబస్తు
శిరివెళ్ల: ఎన్నికల నామినేషన్ల పరిశీలనకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. శిరివెళ్లలో శనివారం నామినేషన్ల పరిశీలన కేంద్రం వద్ద బందోబస్తును తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సబ్ కలెక్టర్ మనీషా, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామాంజనేయుడు, శిరివెళ్ల సర్కిల్ సీఐ ప్రవీణ్ కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ మధుసూదన, సిబ్బంది ఉన్నారు.