Share News

ప్రజల మన్ననలు పొందాలి

ABN , Publish Date - Aug 30 , 2026 | 11:32 PM

ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి అధికారులు ప్రజల మన్ననలు పొందాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

ప్రజల మన్ననలు పొందాలి
అర్జీదారులతో మాట్లాడుతున్న మంత్రి బీసీ

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి అధికారులు ప్రజల మన్ననలు పొందాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల, టీడీపీ నాయకులు, కార్యకర్తల అర్జీలను మంత్రి స్వయంగా స్వీకరిం చారు. పలు అర్జీలను స్వయంగా చదివి సంబంఽధిత అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరిం చారు. రెవెన్యూ, ఇతర సమస్యలకు సంబంధించిన అర్జీలను అధికారులు త్వరగా పరిష్క రించాలని ఆదేశించారు. మంత్రి బీసీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్జీలను పరిష్కరించడానికి కృషి చేసిన మంత్రి బీసీకి ప్రజలు అభినందించారు. అర్జీలను సమర్పించిన మహిళలు మంత్రి బీసీకి రాఖీలుకట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Updated Date - Aug 30 , 2026 | 11:32 PM