వంద శాతం పంచాలి
ABN , Publish Date - Sep 01 , 2026 | 10:55 PM
తొలిరోజే జిల్లాలోని ప్రతి గ్రామంలో వంద శాతం పింఛన్లు పంపిణీ చే సేలా చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రావును కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు.
పింఛన్ల పంపిణీలో తొలిరోజు టార్గెట్
కలెక్టర్ ఏ.సిరి
జిల్లాలో 2,33,431 మందికి రూ. 102.48 కోట్లు
గోనెగండ్ల, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): తొలిరోజే జిల్లాలోని ప్రతి గ్రామంలో వంద శాతం పింఛన్లు పంపిణీ చే సేలా చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రావును కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం గోనెగండ్లలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గోనెగండ్లలోని లక్ష్మీపేటలో నవీన్, రాజే్‌షలకు వైకల్య పింఛన్, ఈశ్వరయ్య, జానకమ్మ చంద్రయ్య, నాగే్‌షలకు వృ ద్ధాప్య పింఛన్లను కలెక్టర్ అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి నెల 2,33,431 మందికి రూ. 102.48 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్ల దగ్గరికి వెళ్లి పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ మీ ఇంట్లో వారు మిమ్ములను ఎలా చూసుకుంటున్నారని, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో అరుణాదేవి, డీఆర్‌డీవో పీడీ శ్రీధర్‌రావు, ఎంపీడీవో మణిమంజరి, డి ప్యూటీ ఎంపీడీవో అనంతశయన, శశిదేవి, డిప్యూటీ తహసీల్దార్ రఘువీర, పలు శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.