Share News

10లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:50 PM

10వ తరగతిలో విద్యార్ధులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాధికారి జనార్దన్‌ రెడ్డి కోరారు.

10లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న డీఈవో

బనగానపల్లె, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : 10వ తరగతిలో విద్యార్ధులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాధికారి జనార్దన్‌ రెడ్డి కోరారు. గురువారం బనగానపల్లె పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా 10వ తరగతి విద్యార్ధులకు జరుగుతున్న ప్రీ ఫైనల్‌ పరీక్షలను ఆయన తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో 10వ తరగతి విద్యార్ధుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న బోజన పథకాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వరూప, పాఠశాల హెచ్‌ఎం ప్రసాదరావు పాల్గొన్నారు.

ఏపీ మోడల్‌ స్కూల్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి :

పట్టణంలోని రవ్వలకొండలోని ఏపీ మోడల్‌ స్కూల్‌ను జిల్లా విద్యాధికారి జనార్దన్‌ రెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ప్రభుత్వం అందించే డొక్క సీతమ్మ మఽధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. స్వయంగా పిల్లలకు భోజనం వడ్డించి విద్యార్ధుల అభిప్రాయాలను తీసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో స్వరూప, శ్రీనివాసులు, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రామలక్ష్మి, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:50 PM