టీడీపీ హయాంలో ముస్లింల అభివృద్ధి
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:11 AM
తెలుగుదేశం పాలనలోనే ముస్లింల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మైనార్టీ, నాయ సహాయ మంత్రి ఫరూక్ అన్నారు. ఆదివారం పట్టణంలో రూ2.62కోట్ల వ్యయంతో నిర్మించిన షాదీఖానాను మంత్రులు ప్రారంభించారు.
మంత్రులు బీసీ, ఎన్‌ఎండీ ఫరూక్
బనగానపల్లెలో షాదీఖానా ప్రారంభం
బనగానపల్లె, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పాలనలోనే ముస్లింల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మైనార్టీ, నాయ సహాయ మంత్రి ఫరూక్ అన్నారు. ఆదివారం పట్టణంలో రూ2.62కోట్ల వ్యయంతో నిర్మించిన షాదీఖానాను మంత్రులు ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు మంత్రి బీసీకి పూలతో స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు. మంత్రి బీసీ మాట్లాడుతూ తన సొంత నిధులు రూ.1.62 కోట్లు వెచ్చించగా, ప్రభుత్వం రూ.కోటి మొత్తం రూ.2.62 కోట్లతో పనులు చేశామన్నారు. 2018లో మంజూరైన షాదీఖానాను వైసీపీ ప్రభుత్వం పూర్తిచేయకపోవడంతో ముళ్ల కంపతో నిండిపోయిందన్నారు. షాదీఖానా నిర్మించడానికి బీసీ జనార్దన్‌రెడ్డి యత్నించగా, ఆయనపై వైసీపీ నాయకులు కేసులు పెట్టారన్నారు. ఎట్టకేలకు తన సొంత నిధులతో పూర్తి చేశాని, టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ రూ.18లక్షలతో వంటపాత్రలు, షాదీఖానాకు అవసరమైన కుర్చీలు, సమకూర్చి, ముస్లింలపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ముస్లింలు సందుల్లో శుభకార్యాలు, వివాహాలు చేసుకునేవారని షాదీఖానా నిర్మాణంతో ఆ సమస్య తీరిందన్నారు. టీడీపీ పాలనలో తల్లికివందనం అమలుతో ముస్లిం చదువుకుంటుటున్నారని, అక్ష్యరాశ్యతా శాతం పెరిగిందన్నారు. దివంగత ఎన్టీఆర్ హయాంలో షాదీఖానాలు. మసీదుల అభివృద్దికి, మౌజంలకు వేతనాలు టీడీపీ హాయంలోనే వచ్చాయన్నారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మంత్రి బీసీ కృషితో బనగానపల్లెకు రింగ్‌రోడ్డు పూర్తి కావచ్చిందని, దద్దనాల ఎత్తిపోతల పథకం సాధ్యమైందన్నారు. గుంతలమయంగా ఉన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గుంతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. ఎన్‌ఎండీ ఫయాజ్, అన్వర్‌సాహెబ్, బనగానపల్లె నవాబ్ వారసుడు మీరుఫజిల్ అలీఖాన్, గురువులయ్య, బురానుద్దీన్, కాశీంబాబు, హైదర్, కాట్రెడ్డి మల్లిఖార్జునరెడ్డి పాల్గొన్నారు.